ఏంటి సన్నిలియోన్ ని ఇలా కూడా వాడచ్చా..ద్యాముడా

updated: February 23, 2018 12:00 IST
ఏంటి సన్నిలియోన్ ని ఇలా కూడా వాడచ్చా..ద్యాముడా

సన్నిలియోన్‌కి వున్న క్రేజ్‌అంతా ఇంతా కాదు అని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఆమెతో సినిమా చేస్తే మినిమం ఓపినింగ్స్ రప్పించుకోవచ్చని మొత్తానికి మొత్తం ఇండస్ట్రీ నమ్మే సిట్యువేషన్ కు వచ్చింది. అయితే ఆమెని ఎంతవరకూ సినిమాల వరకే పరిమితం చేయటం ఏమిటని ఓ పెద్దాయనకు అనిపించింది. ఆమెను వేరే యాంగిల్ వాడి..హిట్ కొట్టాడు.అదేనండి సక్సెస్ అయ్యాడు. ఆ వీర విజయ గాధ చూద్దాం...

 

 ఆంధ్రప్రదేశ్‌కి చెందిన  నెల్లూరు జిల్లా బండకిందిపల్లెకి చెందిన ఏ చెంచు రెడ్డి అనే రైతు తన పొలం, చేనుల్లో సన్నిలియోన్ పోస్టర్లు ఏర్పాటు చేశాడు. అలాగని చెంచు రెడ్డి ఏమీ సన్నిలియోన్‌కి వీరాభిమాని కాదు, అతడు సన్నిలియన్‌పై వున్న అభిమానంతో ఆ పోస్టర్లు ఏర్పాటు చేయలేదు. కాకపోతే తన ఊళ్లోవాళ్లకు సన్నిలియోన్‌పై వున్న అభిమానాన్నే చెంచు రెడ్డి మరో విధంగా వాడుకుంటున్నాడు. 

 

ఆరుగాలం కష్టపడ్డ పంట చేతికొచ్చే టైంకి  ఆ పంట  నాశనం అయితే  రైతుకు కలిగే  బాధ వర్ణనాతీతం. అలా ఏపీకి చెందిన  ఓ 45 ఏళ్ల  రైతు కూరగాయల్ని పండించేవాడు. అంతా బాగానే ఉన్నా రైతుకు మాత్రం ఎక్కడో చిన్న అనుమానం తన పంటకు దిష్టి తగిలిందని అందువల్లే పంటపండలేదని అనుకున్నాడు. దీన్ని తట్టుకోలేని ఆ రైతు పంటకు దిష్టి పోవాలంటే  ఏం చేయాలని తెగ ఆలోచించాడు. ఆలా ఆలోచించగా ఆ రైతుకు శృంగార తార సన్నిలియోన్ గుర్తుకు వచ్చింది. అవును దిష్టికి  .?

 

సన్నిలియోన్ పోస్టర్లు ఏర్పాటు చేసిన ఆ రైతు.. ఆ పోస్టర్ల కింది భాగంలో " నన్ను చూసి ఏడవకురా " అని తాటికాయంత అక్షరాల్లో రాసిపెట్టాడు. అంటే అతడి ఉద్దేశం ఏంటో ఈపాటికే మీకు అర్థమైపోయుంటుంది. అవును, సన్నిలియోన్ పోస్టర్లని అతడు దిష్టిబొమ్మలుగా ఉపయోగిస్తున్నాడన్నమాట. సాధారణంగా పొలం మధ్యలో దిష్టిబొమ్మలు ఏర్పాటు చేయడం ద్వారా పక్షులని పంటచేనుపై వాలకుండా జాగ్రత్త పడటంతోపాటు పంటపై చెడుదృష్టి పడకుండా వుంటుందనేది రైతుల నమ్మకం. అయితే, ఇతను మాత్రం ఓ అడుగు ముందుకేసి.. ఏకంగా సన్నిలియోన్ పోస్టర్లనే ఏర్పాటు చేసి షాక్ ఇచ్చాడు.

 

ఇదే విషయమై మీడియాతో మాట్లాడిన చెంచు రెడ్డి.. తన ప్రయోగం సత్ఫలితాలు అందించింది అనే చెబుతున్నాడు. తన పంట చేను వద్దకొచ్చిన వాళ్లంతా.. చేను మధ్యలో వున్న సన్నిలియోన్ పోస్టర్లనే చూస్తున్నారు కానీ పంటవైపు చూడటం లేదు. అందుకే తన చేనుకి నరదిష్టి సైతం తగలడం లేదు అని ఎంతో నమ్మకంగా చెబుతున్నాడు ఆ రైతు. 

comments