‘రైతుబంధు’తో రైతన్నకు మంచి రోజులు

updated: May 10, 2018 10:59 IST

“రైతే రాజు” అని అనేస్తూంటాం కానీ.. రైతుకు ఎవరూ ఏమీ  చేసింది కనపడదు. ఎన్నికలు  వచ్చినప్పుడల్లా రైతును, వ్యవసాయ రంగాన్ని కేంద్రంగా చేసుకుని రూపొందించి మానిఫెస్టోలో పొందుపరచి హామీలు గుప్పించి అధికారంలోకి వస్తారు కానీ వాళ్లకు చేసేదేమీ కనపడదు. అందుకే మన సన్నకారు రైతుకి..ఎప్పుడూ ఎరువుల కొరత, సాగునీటి సమస్య,  నాణ్యమైన విద్యుత్ సరఫరా, కరువు, మద్దతు ధర  లేకపోవటం ఇవన్నీ అతి సామాన్య సమస్యలుగా మారిపోయాయి.  అప్పటికప్పుడు రాజకీయ నాయకులు తాత్కాలిక ప్రణాళికలే తప్పితే ఏనాడు రైతాంగం సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు దీర్ఘకాలిక ప్రణాళికలు రచించలేదు ఆ దిశగా ఆలోచించను లేదు.  అయితే తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలే వేరు.  తెలంగాణ సిద్దించిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తొలి తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం చేయడానికి పూనుకుంది. రైతులు బాగుంటేనే గ్రామం, రాష్ట్రం తద్వార దేశం బాగుంటుందని కేసీఆర్ భావించి పెట్టిన ‘రైతుబంధు’ పధకం అంతటా చర్చనీయాంశమైంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ రైతాంగ సమస్యల కోసం తను రచించుకున్న ప్రణాళికలను ఆచరణలోకి తీసుకురావడానికి కార్యాచరణ మొదలు పెట్టడంతో రైతాంగం హర్షం వక్తం చేస్తోంది.  వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ తోపాటు నాణ్యమైన సరఫరా అందిస్త్తూ రైతు బంధు పథకం కింద రైతులకు రెండు పంటలకు పెట్టుబడి ఇవ్వడం ద్వారా ఇక తెలంగాణ లో ఏ రైతు ను ఆత్మహత్య దిశగా  వెళ్లకుండా ప్రయత్నం చేసారు. జూన్ 2 నుంచే రైతులకు రూ.5లక్షల రైతు బీమా పథకం అమలు చేస్తున్నారు.రానున్న వేసవి నాటికీ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఈ పథకానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.  రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తూ రైతులచే మన్ననలు పొంది పంట పెట్టుబడులకు ఎకరానికి రూ.4వేలు నగదును అందించనున్నారు.

 కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి చెక్కులను రైతులు ఆనందంగా తీసుకుంటున్నారు. రైతు బంధు పథకంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రైతు బంధు చెక్కులు అందుకుంటున్న రైతులు నేరుగా బ్యాంకుల వద్దకు వెళ్లి నగదును డ్రా చేసుకుంటున్నారు.

 ఈ పథకం కోసం పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించామని, పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకుని బంగారు పంటలు పండించాలని రైతులను కేసీఆర్ కోరారు

‘రైతుబంధు’ చెక్కుతో డబ్బులు తీసుకోవడం ఎలాగంటే..

 రైతు బంధు చెక్కు ద్వారా డబ్బులు డ్రా చేసుకోవాలంటే రైతులు తమ సమీపంలోని ఆంధ్రాబ్యాంక్ (మీ చెక్కు ఏ బ్యాంకుదైతే అదే బ్యాంకు) కు వెళ్లాలి. ఆ బ్యాంకులో  అకౌంట్ ఉండనవసరం లేదు. అక్కడి క్యాషియర్ కి మీ చెక్కు, పట్టాదార్ పాస్ బుక్కు మొదటి పేజి, మీ ఆధార్ కార్డ్ జీరాక్స్ కాపీలు అందజేయాలి. చెక్కు వెనుక, జీరాక్స్ కాపీలలో మీరు సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను సరిపోల్చుకున్నక్యాషియర్, చెక్కుపై ఉన్న మొత్తానికి డబ్బులు అందజేస్తారు.అప్పుడు ఆ డబ్బును తీసుకొని వెళ్ళవచ్చు..


Tags: rythu bandhu, telangana

comments