వ్యవసాయానికి అసలు సిసలు బ్రాండ్ అంబాసడర్ .

updated: August 10, 2018 19:25 IST
వ్యవసాయానికి అసలు సిసలు బ్రాండ్ అంబాసడర్ .

ఈ దేశంలో వెనకబడ్డ వాడు ఎవరైనా ఉన్నాడంటే అది రైతు ఒక్కడే. అందరికి అన్నం పెట్టే రైతన్న ఈ రోజు పస్తులుండాల్సిన పరిస్దితి నెలకొంది. ఎంత మంది ఎన్ని వాగ్దానాలు చేసినా , ఎన్ని పథకాలు ప్రకటించినా వారి జీవితాల్లో మార్పు లేదు. అయితే రైతన్నని నిజంగా మనం కష్టాల్లోంచి బయిటపడేయలేమా...అందుకు మార్గమే లేదా అంటే రైతు పండించే ఉత్పత్తులను సరైన రేటుకు కొనుగోలు చేయటమే ఒకటే మనం చేయగల సాయం. అయితే ఇది కమర్షియల్ ప్రపంచం ...అమ్మ పాలు కు కూడా బ్రాండ్ ,  పబ్లిసిటీ లేనిదే పిల్లలు తాగరేమో అనే పరిస్దితులు తలెత్తుతున్న రోజులివి. ఈ స్దితిలో రైతు తలెత్తుకుని జీవించాలంటే అతని ఉత్పలని బ్రాండ్ చేయాలి. 

రైతుని రాజుగా గౌరవించే సంస్కృతి రావాలి. ఎందుకంటే రైతే లేకపోతే ఈ రోజు మనకు ఆహారం పండించే దిక్కే లేదు. ఈ  సిట్యువేషన్ ని ప్రముఖ సింగర్ శ్రీకృష్ణ విష్ణు బోట్ల గమనించినట్లున్నారు. రైతు కుటుంబ పరోక్ష ఉత్పత్తులైన పెరుగు, వెన్న లను అమ్ముకునే ఓ షాప్ ఓనర్ ఎడ్రస్ ని, ఫోన్ నెంబర్ ని తన సోషల్ మీడియా ఎక్కౌంట్ లో షేర్ చేసారు. అలా చేయటం ద్వారా వాటిపై ఆధారపడి బ్రతికే రైతన్న కుటుంబానికి కొంత సాయిం చేసినట్లు అవుతుంది.  సెలబ్రెటీల్లో చాలా మంది కోట్లు తీసుకుంటూ ఆరోగ్యానికి హాని చేసే బర్గర్స్, కూల్ డ్రింక్స్ , టుబాకో ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూంటే ఈ సింగర్ లాభాపేక్ష లేకుండా ఇలా చెయ్యటం మెచ్చుకోదగ్గ విషయమే కాదంటారా.

Video Courtesy: Instagram page of Srikrishna Vishnubhotla . Please note this video is not monetized 


Tags: Agriculture, Sri krishna Singer

comments